క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని సీఎం జగన్ అన్నారు.
దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం-త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా బాటలు వేశారని జగన్ అన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం… ఇవీ జీసస్ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరోసారి క్రిస్మస్ సందర్భంగా అందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్.