పనామా పత్రాల లీకేజీ కేసు.. ఈడీ విచారణకు ఐశ్వర్యారాయ్..

131
- Advertisement -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ప‌నామా పేప‌ర్ లీక్‌ కేసులో బాలీవుడ్‌ నటి ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్‌కు ఈడీ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఐశ్వర్యారాయ్ విచారణకు హాజరయ్యారు.. పనామా పత్రాల వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు రావాలంటూ ఐశ్వర్యారాయ్ కి ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఈరోజు తాను విచారణకు రాలేనంటూ ఐశ్వర్య బదులిచ్చింది. అయితే అంతలోనే ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్ లో ఉన్న ఈడీ కార్యాలయం వద్ద అనూహ్యరీతిలో ఐశ్వర్యారాయ్ ప్రత్యక్షమైంది. దాంతో ఆమెను విచారించేందుకు ఈడీ అధికారులు సంసిద్ధులయ్యారు.

పనామా న్యాయ సేవల సంస్థ మొసాక్ ఫోన్సెకాకు చెందిన పేపర్లు లీక్ కాగా, అందులో భారత్ కు చెందినవారివే 12 వేల పత్రాలు ఉన్నట్టు వెల్లడైంది. ఈ పేపర్లలో అనేకమంది భారత వ్యాపార రంగ ప్రముఖులతో పాటు బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబీకుల పేర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. దాంతో వారికి ఈడీ సమన్లు జారీ చేసింది.

- Advertisement -