కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిరసన..

29

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో నిరసన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.