రాధేశ్యామ్ ప్రీ రిలీజ్..వేదిక ఫిక్స్‌

132
radhe shyam
- Advertisement -

ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. 2019 నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా జనవరి 14న ఈ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.

తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారైంది. ఈ నెల 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు అభిమానులు తమ అభిమాన హీరోను వేదికపై చూడబోతున్నారు. ఈ వేదికపైనే ట్రైలర్ కూడా విడుదల కానుంది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకుడు. హిందీలో ‘ఆషికీ 2’ ఫేమ్ మిథూన్ సంగీత దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు.

- Advertisement -