కోహ్లీ ఒత్తిడితోనే జట్టులోకి అశ్విన్‌: గంగూలీ

91
ganguly

విరాట్ కోహ్లీ ఒత్తిడితోనే అశ్విన్‌ను టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నామని తెలిపారు బీసీసీఐ చీఫ్ అశ్విన్. ఆ సమయంలో అశ్విన్ ను ఎంపిక చేయకుండా ఉండటానికి నాకు కూడా కారణాలు కనిపించలేదని…. అతను టీం ఇండియాకు టెస్టులో అలాగే ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా అతను అద్భుతాలు చేస్తాడని వెల్లడించారు దాదా.

2016 వరకు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఆ తర్వాత కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. టీం ఇండియాకు మూడు ఏళ్ళు వైట్ బల్ క్రికెట్ ఆడని అశ్విన్ ను తిరిగి ప్రపంచ కప్ కు ఎలా ఎంపిక చేస్తారని విమర్శలు వచ్చిన నేపథ్యంలో దాదా స్పందించారు.