రేపటి నుంచే రైతుబంధు..

118
rythu bandhu
- Advertisement -

రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుండి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బు జమ చేస్తామని వెల్లడించింది. ఈ నెల చివరి వరకు రైతుబంధు డబ్బులను… రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోంది. గత వానాకాలం సీజన్ లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు.. రెండో రోజు రెండు ఎకరాలు, మూడో రోజు మూడు ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు నగదును ఖాతాల్లో బదిలీ చేశారు. ఈ యాసంగి సీజన్ లోనూ అదే పద్ధతిని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

వీలైనంత వేగంగా రైతులఖాతాల్లో డబ్బులు జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల నిధులను… సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు.

- Advertisement -