ఖమ్మం, నల్గొండలో టీఆర్ఎస్ గెలుపు..

30
trs

స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మొత్తం 12 స్ధానాలకు గానూ 6 ఏకగ్రీవం కాగా మిగిలిన 6 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో నల్గొండ, ఖమ్మంలో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది.

నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి,ఖమ్మంలో తాతా మధుసూదన్ రావు విజయం సాధించారు. నల్గొండలో కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా స్వతంత్య్ర అభ్యర్ధి నగేష్‌కు 226 ఓట్లు వచ్చాయి. ఖమ్మంలో తాతా మధుసూదనారావుకు 486 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి రాయల నాగేశ్వరరావుకు 239 ఓట్లు వచ్చాయి. మిగిలిన స్ధానాల్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.