కమల పాత్రతో ప్రేమలో పడ్డాను: శ్రియా సరన్

114
kamala
- Advertisement -

శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించిన చిత్రం గ‌మ‌నం. ఈ సినిమాతో సుజనా రావు దర్శకురాలిగా పరిచయమ‌య్యారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమా డిసెంబర్ 10న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్‌లో…

శ్రియా మాట్లాడుతూ.. ‘కమల పాత్రతో ప్రేమలో పడ్డాను. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణం కెమెరామెన్ బాబా గారు. ఇంత మంచి పాత్రను రాసినందుకు దర్శకురాలు సుజనకు థ్యాంక్స్. అందరూ సినిమాను చూడండి. సాయి మాధర్ గారు రాసిన డైలాగ్స్ అద్భుతంగా వచ్చాయి. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఫీల్ గుడ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాం. మంచి సినిమాను చూశామని అందరూ చెబుతున్నారు. అదే మాకు పెద్ద విజయం. నాకు అలీ పాత్రను ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని అన్నారు.

ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాదిలో నా మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. గమనం వంటి సినిమాతో నా ఏడాది ముగుస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంత మంచి సినిమాలో అద్బుతమైన పాత్రను ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు థ్యాంక్స్’ అని అన్నారు.

దర్శకురాలు సుజన మాట్లాడుతూ.. ‘సినిమాను వీక్షించి ప్రశంసలు కురిపిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. ఇంత మంచి సంగీతాన్ని, ఆర్ఆర్‌ను ఇచ్చినందుకు ఇళయరాజా గారికి థ్యాంక్స్. కెమెరామెన్, నిర్మాత బాబా (జ్ఞానశేఖర్) గారికి థ్యాంక్స్. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. కమల పాత్రకు శ్రియ జీవం పోశారు. అలీ ఝారా, మనో భాను అందరూ అద్బుతంగా నటించారు. మా ప్రయత్నానికి ఇంతగా సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని అన్నారు.

- Advertisement -