కృష్ణానదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వేద పాటశాల విద్యార్థులు గల్లంతైన విషాద ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద ఉన్న శ్వేత శృంగాచలం వేద వేదాంత గురుకుల వేద పాఠశాల వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక వేదపాఠశాలకు చెందినఆరుగురు విద్యార్థులు గ్రామంలో కృష్ణా నదిలో స్నానం చేసేందుకు నది వద్దకి వెళ్లి నదిలోకి దిగారు. ఈత రాకపోవడంతో వారంతా నది ప్రవాహంలోకి జరుకొని విద్యార్థులు అందరూ మృతి చెందారు. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని ఈతగాళ్ల సాయంతో మృత దేహాలను బయటకు తీశారు. మృత్యువాత పడిన విద్యార్థులు వివరాలు పరిశీలిస్తే మృతులు.. సుబ్రహ్మణ్యం శర్మ, హర్షిత్ శుక్లా, శుభమ్ త్రివేది, అన్షుమాన్ శుక్లా, శివ శర్మ, నితీష్ కుమార్ లు ఉన్నారు.
వీరిలో సుబ్రహ్మణ్యం శర్మ గుంటూరుకి, శివ శర్మ మధ్యప్రదేశ్ చెందగా మిగిలిన నలుగురు ఉత్తరప్రదేశ్ రాష్టానికి చెందిన వారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి స్థానికంగా వేద పాఠశాలలో వేదాలను అభ్యసిస్తున్నారు. దీనితో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అధికారులు మృత దేహాలని వారి వారి స్వస్థలాలకు తరలించేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు.