వరుణ్‌తేజ్‌ ‘గని’ మరోసారి వాయిదా..

43

టాలీవుడ్‌ మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం ‘గని’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ కంపెనీ, రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది.. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో సయూ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది.

ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఇక ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించింది చిత్రబృందం. ఆ తర్వాత ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రటించారు. ఆ తర్వాత ‘అన్నాత్తే’ (పెద్దన్న) పోటీలో ఉండటంతో ఈ సినిమాను డిసెంబర్ 3కు రీ షెడ్యూల్ చేశారు. కానీ డిసెంబర్ 2న బాలకృష్ణ ‘అఖండ’ మూవీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ 24కు మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రం బృందం అధికారికంగా తెలియజేసింది.