- Advertisement -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోని రెండు స్థానాలకు కరీంనగర్, హుజురాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, సిరిసిల్ల, హుస్నాబాద్ లలో పోలింగ్ జరుగనుంది. క్యాంపుల నుండి స్థానిక ప్రజా ప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో 8 పోలింగ్ కేంద్రాలుండగా 1324 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోటిలో పదిమంది అభ్యర్థులుండగా 10 ఎసిపిలు,26 మంది సిఐలు,54 ఎస్సైలు,115 ఎఎస్సైలు,323 మంది కానిస్టేబుల్ లతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
- Advertisement -