రహదారిని మూసివేయడం తగదు: తలసాని

25
talasani

ప్రజలు వినియోగిస్తున్న రహదారులను రైల్వే అధికారులు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో గల హమాలీ బస్తీలో బస్తీ దవాఖానా ను ప్రారంభించారు..

తమ బస్తీ నుండి ఎన్నో సంవత్సలుగా రాకపోకలు సాగిస్తున్న రహదారిని ఎలా మూసివేస్తారని రైల్వే అధికారులను ప్రశ్నించారు. మూసిన రహదారిని వెంటనే తెరవాలని టౌన్ ప్లానింగ్, పోలీసు అధికారులను ఆదేశించారు.