- Advertisement -
స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపన్నారు మంత్రి హరీష్ రావు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆదిలాబాద్ నుండి దండే విఠల్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలోని 8 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 1271 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు. వీరిలో 19 మంది ఎక్స్ అఫిషియో ఓటర్లు ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియనుంది.
- Advertisement -