- Advertisement -
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని హైదరాబాద్ హబ్సిగూడ ఆయన నివాసంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే విద్యార్థులు ఒక సంవత్సరం విద్యను నష్టపోయారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోన నిబంధనలు పాటిస్తూ అన్ని విద్యా సంస్థలను నడిపిస్తామన్నారు. విద్యా సంస్థలు మూసివేస్తారన్న పుకార్లు నమ్మొద్దని ఆమె తెలిపారు. దాదాపు అన్ని విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు ఇతర సిబ్బందికి రెండో డోస్ టీ కూడా కంప్లీట్ అయిందని ఆమె తెలిపారు. ప్రవేటు స్కూల్ కంటే ప్రభుత్వ పాఠశాలలో ఆన్లైన్ క్లాసులు బెటర్‌గా నిర్వహించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన విద్య ఇతర సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
- Advertisement -