దొంగ బంగారం కేసులో వైసీపీ నాయకుల అరెస్టు..

31

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురంలో వైఎస్సార్సీపీ మాజీ మహిళ కౌన్సిలర్, మరో ఇద్దరి నాయకులను దొంగ బంగారం కేసులో బుధవారం అర్ధరాత్రి కర్ణాటక పోలీసులు సోదాలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక పోలీసులు వాహనం వెళ్లనివ్వకుండా అక్కడ ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు వాహనం అడ్డుకొని రచ్చరచ్చ చేశారు. చివరకు స్థానిక పోలీసుల సహాయంతో కర్ణాటక పోలీసులు బెంగళూర్ సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే ఈ ముగ్గురు సంబంధించి హిందూపురం పోలీస్ స్టేషన్‌లో కూడా పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఏదిఏమైనప్పటికీ హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగ బంగారం సంఘటనకు పాల్పడటంపై కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.