బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న..

72
telangana bjp
- Advertisement -

జర్నలిస్టు చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా‌కు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర బీజేపీ నేతలకు మల్లన్న ధన్యవాదాలు తెలిపారు.

ఓ జ్యోతిష్యుడిని బ్లాక్‌మెయిల్ చేశారంటూ నమోదైన కేసులో పోలీసులు మల్లన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదుకాగా 6 కేసులను కోర్టులు కొట్టేశాయి. మరో 32 కేసులకు సంబంధించి 31 కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైల్లో 74 రోజులు పాటు రిమాండ్‌లో ఉన్న మల్లన్న ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే.

- Advertisement -