ప్రభాకర్ శివాల దర్శకత్వంలో “గోకులంలో గోవిందుడు”

41
gokulamlo gvondudu

ఇంతకుముందు తమిళ హీరో అపరిచితుడు విక్రమ్ తో “ఊహ”, వడ్డే నవీన్ హీరోగా శ్రీమతి కల్యాణం” చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రతిభాశాలి ప్రభాకర్ తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

“గోకులంలో గోవిందుడు” పేరుతో ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై వ్యాపారవేత్త పి.ఎన్.రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ పనులతోపాటు నటీనటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుపుకొంటున్న “గోకులంలో గోవిందుడు” ఫిబ్రవరి ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, స్టిల్స్: రమణ, సినిమాటోగ్రఫీ: రాజేష్ కె.కతూరి, నిర్మాత: పి.ఎన్.రెడ్డి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ప్రభాకర్ శివాల!!