‘వైఎస్ఆర్ ఆసరా’.. రెండవ విడత సంబరాలు..

170
YSR Asara
- Advertisement -

ఆం(ధ(పదేశ్ రా(ష్ట ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా ద్వారా రెండవ విడత సంబరాలు జరుపుకున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 32 కోట్ల 75 లక్షల రూపాయలు నేరుగా డ్వాక్రా మహిళల అకౌంట్‌లో వేయడం జరిగింది. ఈ మేరకు చెక్కులను ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతుల మీదగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల చేతులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీముని పల్లి లక్ష్మీదేవి,వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి మరియు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి , మునిసిపల్ కమిషనర్ వెంకటరమణయ్య నాయకులు ,డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -