- Advertisement -
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ. బాక్సాఫీస్ ముందు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు ప్రశంసలు గుప్పించగా తాజాగా మోహన్ బాబు సైతం అఖండ చిత్రయూనిట్‌పై ప్రశంసలు గుప్పించారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ..సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు, చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో అఖండ విజయం సాధించిన “అఖండ” సినిమా, సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది, విడుదలకి సిద్దంగా ఉన్న చాలా సినిమాలకి ధైర్యాన్నిచ్చిందన్నారు. నా సోదరుడు బాలయ్యకి, ఆ చిత్ర దర్శకుడికి, నిర్మాతకి, సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. మంచి సినిమాని అదరించే ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు తెలిపారు మోహన్ బాబు.
- Advertisement -