త్వరితగతిన ఉద్యోగుల విభజన..

493
ts
- Advertisement -

రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాల స్థానంలో 33 జిల్లాలు ఏర్పాటు చేశారని టీఎన్జీవో ప్రెసిడెంట్ మామిళ్ల రాజేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్థానికంగా ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు దక్కాలని చెప్పారు..త్వరితగతిన ఉద్యోగుల విభజన చేయాలని సీఎస్ దగ్గర సమావేశం అయ్యాం అన్నారు.

ఉద్యోగుల విభజన ఎలా జరగాలని అనే దానిపై ఇవాళ సూచనలు సలహాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికి నష్టం జరగకుండా ప్రసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ రెండు దఫాలుగా చర్చలు జరిపారు…ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలని చెప్పామన్నారు. మా సూచనలు సలహాలు పాటిస్తాం అని వాళ్ళు తెలిపారు.

భార్యాభర్తలు,ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపాం…ఎస్సి, ఎస్టీ కులాల వారికి కూడా రోస్టర్ విధానం పాటించాలని కోరామన్నారు. ఉద్యోగుల పనిభారం తగ్గించేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారు…95% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దేశం లో ఎక్కడ లేదు.29 రాష్ట్రల్లో తెలంగాణ లో పని చేసే ఉద్యోగులు అగ్రభాగాన ఉన్నారన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30% పీఆర్సీ ఇచ్చిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు సీఎం కేసీఆర్ మాత్రమే దక్కుతుందన్నారు.

ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు టీజీవో అధ్యక్షురాలు మమత. లోకల్ క్యాడర్ కు అనుకూలంగా విభజన జరుగుతుంది…చాలా సమస్యగా ఉన్న ఈ సమస్యను ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అన్ని రకాల ఉద్యోగులు ఈ విభజనకు సహకరించాలి..ఈనెల లోపలనే ఆప్షన్ ఉంటాయి.ఈ ఆప్షన్ లు ఆఫ్ లైన్ లోనే ఉంటాయన్నారు. ఉద్యోగుల నోటిఫికేషన్ లపై సీఎం కేసీఆర్ త్వరలోనే భేటి ఉంటుందన్నారు.

- Advertisement -