ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ( డిసెంబర్ 3వ తేదీ) సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ దివ్యాంగులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దివ్యాంగుల (వికలాంగుల ) దినోత్సవం సందర్భంగా మీ అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్ వికలాంగులు అనే పదాన్ని నిషేధించారు. దివ్యాంగులు అని గౌరవంగా పిలవాలని చెప్పారు. మన ప్రభుత్వం మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. మీ భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి చిత్తశుద్ధితో పాటుపడ్తున్నమన్నారు.
దివ్యాంగులకు ఇచ్చే రూ.500 పింఛను,రూ.15 వందలు, ఇప్పుడు రూ.3 వేల 16కు పెంచినం..సుమారు 5లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా 18 వందల కోట్లు ఖర్చు చేస్తోంది. దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ప్రోత్సాహాకం ఇస్తున్నం. అలాగే వారికి ఉద్యోగాలలో 2%రిజర్వేషన్లు ఇస్తున్నం.. అభివృద్ధి, సంక్షేమ పథకాలలో రిజర్వేషన్లను 3% నుంచి 5% పెంచినం.. దివ్యాంగులకు డబుల్ బెడ్ రూం ఇండ్లలో 5% కేటాయిస్తున్నమని తెలిపారు. అంధత్వం ఉన్న వాళ్లు ఉచిత కంప్యూటర్ శిక్షణతో పాటు ల్యాప్ టాప్స్ ఇస్తున్నమని..మీకు కావలసిన ఉపకరణాలను ఉచితంగా ఇస్తున్నమని మంత్రి చెప్పారు.
ఇటీవల 21కోట్లతో 14వేల మందికి ఉపకరణాలను ఇచ్చినం. 90వేల విలువ చేసే టూవీలర్లను కూడా అందజేసినం..అలాగే వారికి స్మార్ట్ ఫోన్లు,వీల్ ఛైర్లు,ట్రైసైకిళ్లు అందించినమని మంత్రి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు లేవు. మానవ సేవనే మాధవసేవ అని మనసారా భావిస్తూ ప్రభుత్వం మీ బాగోగులు చూస్తున్నది. మీరు ఆత్మన్యూనతా భావాన్ని పూర్తిగా విడనాడి ఆత్మ స్థైర్యం,ఆత్మ విశ్వాసం,దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి,ఆత్మ గౌరవాన్ని మరింత పెంపొందించుకుంటూ నిండూ నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తున్న అని మంత్రి అన్నారు.
తూ.గోదావరికి చెందిన సింహాచలం (అంధుడు ) IAS సాధించిండు. శరీరం ఏ మాత్రం సహకరించకున్నా కూడా స్టీఫెన్ హాకింగ్ గొప్ప మేధావిగా కీర్తిగడించిండు..ప్రమోద్ భగత్ (బాడ్మింటన్ ) పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిండు. బాలన్ పుతేరీ ( అంధుడు) 2 వందల పుస్తకాలు రాసిండు, పద్మశ్రీ అవార్డు తీసుకుండు.. ఈ విధంగా మీరు కూడా ఎదగాలని,ఎదుగుతారని ఆశిస్తున్న.. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అన్ని రంగాలలో రాణించాలి, ఉన్నతంగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న, ఆశీస్సులు అందజేస్తున్న అని మంత్రి తెలిపారు.