రోడ్ల నిర్మాణానికి నిధులు పెంచాలి- నామా

65

లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర రోడ్ల నిర్మాణంపై టీఆర్‌ఎస్‌ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు ప్రశ్నించారు. ఈమేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సిఆర్ఐఎఫ్ కింద రూ.744 కోట్ల నిధులను విడుదల చేయాలని నామా నాగేశ్వరరావు కోరారు. 2021-22, 2022-23 ఆర్థిక ఏడాది కింద మంజూరైన రోడ్ల నిర్మాణాన్నీ పూర్తి చేసేందుకు నిధుల కేటాయింపులు పెంచాలన్నారు. తెలంగాణ రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ నుంచి మొత్తం 42 ప్రపోజల్స్ వచ్చాయని కేంద్రం తెలిపింది.

సిఆర్ఐఎఫ్ పథకం వివిధ రోడ్ల నిర్మాణానికి రూ. 744 కోట్ల ప్రతిపాదనలు తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అందాయి. మొదట 37 రోడ్ల పనులకు సంబంధించి రూ. 445.90 కి.మీలకు గాను రూ. 620 కోట్లు విడుదల చేశారు. మిగతా 5 ప్రపోజల్స్ కు సంబంధించి రూ. 77.41 కి.మీ లకు గాను రూ. 124 కోట్ల నిధులు కేటాయించాము. రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి సిఆర్ఐఎఫ్ కింద నిధులను కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2021-22 ఏడాదికి రూ. 262.19 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిసింది. కాగా 2022-23 ఆర్థిక ఏడాదికి నిధులను కేటాయింపు అప్పుడే నిర్ణయిస్తామని కేంద్రం వివరించింది. సిఆర్ఐఎఫ్ పనుల కోసం బిఓఎస్ 2.63 % ప్రకారంగా తెలంగాణకు నిధుల కేటాయింపు జరుగుతుందని కేంద్రం పేర్కొంది.