బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 88 హైలైట్స్

137
siri
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 88 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఐస్ టబ్స్ లో నుంచి కాళ్లు బయటపెట్టకుండా తమ దగ్గర ఉన్న బాల్స్‌ని కాపాడుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా స్ధాన చలనంలో భాగంగా సిరి పక్కకు సన్నీ వెళ్తే.. కాజల్-మానస్ మధ్యలోకి షణ్ముఖ్ వచ్చాడు.

అంతే ఇకనుండి ఆటమొదలైంది. సన్నీ అలా కాలు కిందికి పెట్టాడో లేడో.. సిరి వచ్చి బాల్‌లు నొక్కేసింది. నా కాలు టబ్‌లోనే ఉందని సన్నీ చెప్తుంటే… లేదు సన్నీ అని ఆట మొదలుపెట్టింది సిరి. ఈ క్రమంలో సన్నీ బాల్స్ సిరి కిందపడేయగా అయితే సిరి బాల్ తీసే టైంలో సన్నీ ఒక కాలు కింద.. ఒక కాలు టబ్‌లో ఉన్నట్టుగా కనిపించింది.

దీంతో సిరి పెర్ఫామెన్స్ మొదలుపెట్టింది. నేను గివ్ అప్ ఇవ్వను గేమ్ ఆడతాను అంటూ పెద్దగా అరుస్తూ.. ఏడ్వడం మొదలుపెడితే.. షణ్ముఖ్.. సిరీ సిరీ.. రవీ.. రవీ ఐయామ్ ప్లేయింగ్ ఫర్ యు అంటూ అక్కడ నుంచి అరవడం మొదలుపెట్టాడు. మధ్యలో శ్రీరామచంద్ర ఎంటరైతే నేను గేమ్ ఆడోద్దా అంటూ చురకలు అంటించారు సన్నీ. వాళ్ల మధ్య వాదన జరుగుతుండగా.. సిరి మళ్లీ సన్నీ బాల్స్ కొట్టేసింది. సన్నీ వెళ్లి ఆమె బాల్స్‌ని కిందపడేసి.. కాళ్లు టబ్‌లో లేవు అని అన్నాడు.. మళ్లీ సేమ్ గొడవ కాళ్లు ఉన్నాయని సిరి.. లేవని సన్నీ.. షణ్ముఖ్ అయితే సిరివైపునే మాట్లాడి కాళ్లు ఉన్నాయి అని తీర్పు ఇచ్చాడు.

పడేసిన బాల్స్‌ని సన్నీ ట్యూబ్‌లోకి తెచ్చి పెట్టాడు సన్నీ. అయితే ఓవైపు ఏడుస్తూనే ఉన్న సిరి.. సన్నీ బాల్స్ తీయడం మాత్రం మానలేదు. బజర్ మోగేసరికి సిరి కాళ్లు ఐస్‌లో నుంచి తీయకుండా అలానే మొండిగా గేమ్ ఆడి.. ఏడుస్తూనే ఉంది.గాయాలపాలైన ఇంటి సభ్యుల కోసం హౌస్‌లోకి డాక్టర్‌ని పంపారు బిగ్ బాస్.

తర్వాత సిరి- షన్ను మధ్య కాసేపు గొడవ జరుగగా తర్వాత కాసేపటికే ఇద్దరూ కలిసి ఒకే దుప్పటిలోకి దూరారు. ఒకర్నొకరు ఓదార్చుకుంటూ కనిపించారు. ఇక బయట సన్నీ …కాజల్.. మానస్‌లతో మాట్లాడుతూ.. రవిని నామినేట్ చేసి బయటకు పంపేసి.. ఇప్పుడు రవి రవి అని అరుస్తున్నారేంట్రా? వీళ్లు ఎవర్ని బ్లేమ్ చేస్తున్నారు? ఈ డ్రామాలు ఎవరి కోసం అంటూ ఫైర్ అయ్యాడు. మొత్తంగా సిరి- షణ్ముఖ్‌ ఆట ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది.

- Advertisement -