ఐపీఎల్ 13వ సీజన్ వేలం ముగిసింది. ఐపీఎల్‌లో అత్యధిక ఐదుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకున్న ముంబై..కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌ను తన వద్దే ఉంచుకుంది. ఈ నలుగురి కోసం 42 కోట్లను కేటాయించింది. రోహిత్‌కు 16 కోట్లు, బుమ్రా 12, సూర్యకుమార్ యాదవ్ 8 కోట్లు, పొలార్డ్ 6 కోట్లకుతో రిటెయిన్ చేసుకుంది.
ఆర్‌సీబీ… కోహ్లీ 15 కోట్లు, మ్యాక్స్‌వెల్ 11 కోట్లు, మహమ్మద్ సిరాజ్ 7 కోట్లకు రిటెయిన్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ మయాంక్‌కు 12 కోట్లు, అర్ష్‌దీప్‌కు 4 కోట్లు కేటాయించగా హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు 14 కోట్లు, అబ్దుల్ సమద్ 4 కోట్లు, ఉమ్రాన్ మాలిక్ 4 కోట్లు పెట్టింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు…కెప్టెన్ సంజూ శాంసన్ 14 కోట్లు, బట్లర్ 10 కోట్లు, జైశ్వాల్ 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఇక సీఎస్‌కే ధోనిని రిటైన్ చేసుకుంది. ధోనీతో పాటు రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ రిటైన్ చేసుకోగా ధోనీ కోసం 12 కోట్లు, జడేజాకు 16 కోట్లు, మొయిన్ అలీకి 8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్‌కు 6 కోట్లు కేటాయించింది.
కోల్‌కత్తా నైట్ రైడర్స్…సునీల్ నరైన్ 6 కోట్లు, ఆండ్రూ రస్సెల్ 12 కోట్లు, వెంకటేశ్ అయ్యర్ 8 కోట్లు, వరుణ్ చక్రవర్తి 8 కోట్లతో రిటెయిన్ చేసుకుంది. కెప్టెన్ ఇయన్ మోర్గాన్‌ను వదిలేసింది. ఢిల్లీ కేపిటల్స్… కెప్టెన్ రిషభ్ పంత్ 16 కోట్లు, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 9 కోట్లు, ఓపెనర్ పృథ్వీ షా 7.5 కోట్లు, పేస్ బౌలర్ ఎన్రిచ్ నార్జ్ 6.5 కోట్లు పెట్టి తమ వద్దే ఉంచుకుంది.