బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 87 హైలైట్స్

169
shanmukh
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 87 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. కాజల్‌ని ప్రియాంక నామినేట్ చేయడాన్ని తప్పుబట్టారు మానస్. కాజల్‌కి నువ్ చెప్పిన రీజన్ కరెక్ట్ అని అనుకుంటున్నావా? అని అడగ్గా.. కాదని నేనే అంటున్నా కదా.. మరి నువ్ నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు అని మానస్‌ని అడుగుతుంది ప్రియాంక. అయితే తర్వాత మానస్ ఇచ్చిన సమాధానానికి బాధపడిపోయి.. నీ ఫ్రెండ్‌ని చేశానని కానీ నువ్ ఫీల్ అవుతున్నావా అని మానస్‌ని అడుగుతుంది. షణ్ముఖ్, కాజల్‌ల మధ్య తేడా చెబుతూ నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలని పింకీకి సూచిస్తాడు మానస్.

ఆ తరువాత వాష్ రూం దగ్గరకు వచ్చి సన్నీ, కాజల్‌లతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ప్రియాంక వచ్చి.. నేను మాట్లాడుతుంటే వచ్చేస్తున్నావ్ ఏంటి? అని గొడవపడుతుంది. తర్వాత ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. బయట కూర్చున్న సిరి-షణ్ముఖ్‌..కాజల్‌పై రన్నింగ్ కామెంటరీ చేస్తారు. ఇక మానస్‌తో గొడవపడి సిరి దగ్గర బోరు బోరున ఏడ్చేసి సీన్ క్రియేట్ చేసిన ప్రియాంక.. తర్వాత మానస్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది.

తర్వాత కాజల్-మానస్‌లు మాట్లాడుకుంటూ ఉండగా.. పింకీ వచ్చి మాకు స్పేస్ కావాలి.. నువ్ బయటకు వెళ్లు కాజల్ అని అంటుంది ప్రియాంక. వెంటనే కాజల్ లేచి వెళ్లిపోతూ.. స్పేస్ ఇవ్వడం అంటే ఇదే గుర్తుపెట్టుకో పింకీని అనగా పింకీ రెచ్చిపోయింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దది కాగా మానస్‌..కాజల్‌కు సపోర్ట్ చేస్తాడు.ప్రియాంక.. ఆ కోపాన్ని కాజల్‌పై చూపిస్తుంది.. గొడవలు పెట్టేసి ఏమీ తెలియనట్టు కూర్చుటుంది.. అందరూ అంటుంటే తెలియలేదు కానీ.. ఇప్పుడు తెలిసింది అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది ప్రియాంక.

తర్వాత షణ్ముఖ్‌…ప్రియాంక దగ్గర కూర్చుని పుల్లలు వేస్తాడు. నువ్ టాప్ 5లో ఉండాలంటే.. వేరే వాళ్లకి జై కొడితే కావు.. వాళ్లు నిన్ను సెపరేట్ చేస్తున్నారు.. సన్నీ నామినేషన్స్‌లో లేడు కాబట్టి.. కాజల్ అతనికి దగ్గరగా ఉంటుంది.. అతని ఫ్యాన్స్ ఓట్లు ఆమెకు పడతాయని.. అని పుల్ల వేశాడు. మొత్తంగా షణ్ముఖ్ కొత్తరంగు బయటపడింది.

- Advertisement -