తెలంగాణ చరిత్రలో అపూర్వ ఘట్టం…

129
sathya
- Advertisement -

తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడమే ఏకైక ధ్యేయంగా తెలంగాణ వచ్చుడో..కేసిఆర్ సచ్చుడో అనే నినాదంతో పుష్కరకాలం కింద ఇదే రోజున దీక్ష ప్రారంభించి, తెలంగాణ ఉద్యమ దిశను మార్చి, తెలంగాణ రాష్ట్ర సాకార ఏర్పాటుకు పునాది వేసిన నవంబర్ 29వ తేదీ ఈ దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు.

అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి, తెలంగాణ రాష్ట్ర సాధనకు తన ఊపిరినే పణంగా పెట్టి, స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన కార్యసాధకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారు నాడు చేసిన దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో అపూర్వ ఘట్టమన్నారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కంటే నాయకుడికి ఆయువు ముఖ్యం కాదని ఉద్యమ నేతగా కేసిఆర్ గారు తన కార్యాచరణలో ఆచరించి చూపించిన ఈ రోజును దిక్షా దివస్ గా దీనిని తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన తెలంగాణను ముఖ్యమంత్రి కేసిఆర్ గారు దేశంలోనే అనేక రంగాలలో అగ్రగామిగా నిలబెడుతూ నెంబర్ వన్ రాష్ట్రంగా చేశారన్నారు.

- Advertisement -