- Advertisement -
టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట విషాదం నెలకొంది. ఈ రోజు తెల్లవారుజామున శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు వైట్ల మృతి చెందారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా కందుపాలెంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్త విన్న శ్రీను వైట్ల ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడికి బయల్దేరింది.
కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. శ్రీను వైట్లకు పితృవియోగం అనే బాధాకరమైన వార్త విన్న సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా శ్రీనువైట్ల ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమాతో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
- Advertisement -