ఏపీ స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

107
- Advertisement -

ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 28,509 కరోనా పరీక్షలు నిర్వహించగా, 248 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,446 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,55,856 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,158 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 14,432 మంది మరణించారు.

ఇక కొత్త నమోదైన కేసులలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 56 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 39, తూర్పు గోదావరి జిల్లాలో 38, చిత్తూరు జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 253 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

- Advertisement -