కరోనా కొత్త వేరియంట్.. ఐసీసీ కీలక నిర్ణయం..

100

మరోసారి క్రీడారంగంపై కరోనా ప్రభావం పడింది. ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీని ప్రభావం ఇప్పుడు జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీపై కూడా పడింది. ఈ కొత్త వేరియంట్ ప్రభావంతో ఈ టోర్ని నిలిచిపోయింది. కొత్త వేరియంట్ నేపథ్యంలో అనేక ఆఫ్రికా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధిస్తుండడంతో టోర్నీని నిలిపివేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది.