సురవరం చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవలి:శ్రీనివాస్ గౌడ్

132
srinivas goud
- Advertisement -

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ – 2021 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 15 వ జాతీయ బహుభాషా డ్రామా ఫెస్టివల్ ను హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కు చెందిన వైతాళికులను, మహనీయులను, సాహితీ వేత్తలను, కవులను, కళాకారులను గౌరవిస్తూ, వారి జయంతి, వర్ధంతి లను అధికారికంగా నిర్వహిస్తూ, వారి పేరుతో అవార్డుల ను అందిస్తున్నామన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి పేరుతో రూపొందించిన నాటకాన్ని ఈ ఫెస్టివల్ లో ఈ ప్రదర్శించటాన్ని నిర్వాహకులను అభినందించారు. సురవరం చరిత్ర ను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. సురవరం చరిత్ర సినిమా గా, సీరియల్స్ గా రావాలని ఆకాంక్షించారు. సురవరం అందించిన సేవలను శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ , నాటక రచయిత డా. విజయభాస్కర్, అభినయ శ్రీనివాస్, దర్శకుడు బాపురెడ్డి, శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి వారసులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -