బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 82 హైలైట్స్

21
siri

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ విజయవంతంగా 82 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా శ్రీరామచంద్ర సిస్టర్,సన్నీ అమ్మ,సిరి అమ్మ హౌస్‌లోకి ఎంటరై సందడి చేశారు. ఫ్యామిలీ ఎపిసోడ్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లోకి శ్రీరామ చంద్ర చెల్లెలు అశ్విని ఎంట్రీ ఇచ్చింది. సూటిగా సుత్తిలేకుండా అన్నట్టుగా చెప్పాల్సిన విషయాన్ని స్వీట్ అండ్ కూల్‌గా శ్రీరామ్‌కి అర్ధమయ్యేట్టుగా చెప్పింది.

ఇక తర్వాత హౌస్‌లోకి మానస్ తల్లి ఎంట్రీ ఇచ్చింది. వచ్చినప్పటి నుండి వెళ్లేంత వరకు పంచ్ డైలాగ్‌లు, ఎనర్జీతో ఆకట్టుకుంది. తాను చెప్పాలనుకుంది మానస్‌కు అర్ధమయ్యేట్టుగా చెప్పేసింది. ఇక రవి,శ్రీరామచంద్రలపై పంచ్‌లు వేసింది. నా కొడుక్కి పెళ్లిళ్లు చేస్తావా? ఏంగేజ్ మెంట్‌లు చేస్తావా? అని రవిపై పంచ్‌లు వేయగా పెళ్లిళ్ల పేరయ్య వాడు (షణ్ముఖ్) కదా.. నువ్ ఎట్టా అయ్యావ్ అంటూ నువ్ నాకు హగ్ ఇయ్యి నేను వెళ్లి ఆ హగ్‌ని అక్కడ (దీప్తి) ఇచ్చేస్తా అని వరుస పంచ్‌లు వేసింది పద్మిని. మానస్‌తో మాట్లాడుతూ గేమ్ చాలా బాగా ఆడుతున్నావని.. ప్రతి పేరెంట్స్ నిన్ను విన్నర్‌గా చూడాలని కోరుకుంటున్నారు అని చెప్పుకొచ్చింది.

ఇక తర్వాత హౌస్‌లోకి ఎంటరైంది సిరి తల్లి శ్రీదేవి. కూతురిని చూసి కంటతడి పెట్టుకుంది. సిరిని పొగుడుతూనే షణ్ముఖ్ నువ్వు హగ్ చేసుకోవడం నాకు నచ్చడం లేదు..అతడి ముందే దిమ్మతిరిగే పంచ్ ఇచ్చింది. దీంతో షణ్ముఖ్‌ ముఖచిత్రం మారిపోయింది. తండ్రి లేని పిల్ల కదా అని షణ్ముఖ్ ఓ తండ్రిలా అన్నలా.. ఫ్రెండ్‌లా సిరికి హెల్ప్ చేస్తున్నాడు.. బాగా దగ్గరైపోతున్నాడు. దగ్గరకావడం మంచిదే కానీ.. హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదని తెలిపింది.

తల్లిగా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్పానని సిరికి చెప్పిన శ్రీదేవి …పదే పదే షణ్ముఖ్‌తో ఓ తండ్రిగా, అన్నగా హెల్ప్ చేస్తున్నావని ప్రస్తావించింది. సిరి తల్లి మాటలకు షణ్ముఖ్ డల్ అయిపోయాడు.