ఎమ్మెల్సీగా కవిత నామినేషన్..

229
kavitha
- Advertisement -

నిజామాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత తరపున నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే బిగాల గణేష్. జనవరి 4తో పదవికాలం ముగియనుండగా మరోసారి అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్.

ఇటీవల రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ఖరారు చేయడంతో.. ఆయన స్థానంలో కవితను పంపిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్‌ స్థానానికి సిటింగ్‌ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఊహాగానాలకు తెరదించుతూ.. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ కవిత పేరునే ఖరారు చేసింది.

ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 26 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. డిసెంబరు 10న పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు జరపనున్నారు.

- Advertisement -