కోటిరెడ్డి ఎన్నికల లాంఛనమే..

194
- Advertisement -

నల్గొండ జిల్లా స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంసీ కోటిరెడ్డి ఎన్నికల లాంఛనమే అని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థిగా కోటి రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగదీష్ రెడ్డి… ప్రతిపక్షాలు నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాను వ్యవసాయంలో అగ్రగామిగా నిలిపారని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోలి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా గులాబీ కంచు కోటగా మారిందన్నారు.

సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ సీఎం కేసీఆర్ ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులంతా కలిసి కట్టుగా పని చేసి, ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడ్డ నాయకునిగా సీఎం కేసీఆర్ గొప్ప పేరు తెచ్చుకున్నారు.

- Advertisement -