- Advertisement -
గత ఏడాదిన్నగా భారత్ – చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే చైనా దుందుడుకు చర్యలతో భారత భూభాగంలో నిర్మాణాలు చేపడుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో మరో నిర్మాణాన్ని పూర్తిచేసినట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 60 భవనాలతో రెండో క్లస్టర్ నిర్మాణం పూర్తిచేసింది. 2019 మార్చి- 2021 ఫిబ్రవరి మధ్య అరుణాచల్‌లోని షీ యోమి జిల్లాలో ఈ భవనాల నిర్మాణాలను పూర్తి చేసింది.
అయితే, కొత్త నిర్మాణాలు చేపట్టిన ప్రాంతం చైనా భూభాగంలోదేనని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. పెంటగాన్ నివేదికపై స్పందించిన భారత సైన్యం ఆ నిర్మాణం ఇప్పటికిప్పుడు పూర్తిచేసింది కాదని స్పష్టం చేసింది. ఆరు దశాబ్దాల కిందటే భారత్-చైనా యుద్ధ సమయంలో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుందని, 1960 నుంచే ఈ గ్రామం ఉందని తెలిపింది.
- Advertisement -