రివ్యూ: రామ్ అసుర్

585
ram asur
- Advertisement -

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో చిన్న సినిమాలు సంచలనాలు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త హీరోలతో వచ్చిన చిన్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుండగా తాజాగా అలాంటి కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీనే రామ్ అసుర్‌. డైమండ్ చుట్టూ తిరిగే కథకు ఇద్దరి జీవితాలు ఎలా ముడిపడ్డాయి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం..

కథ:

రామ్ (రామ్ కార్తీక్) కృత్రిమంగా వజ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేడు. అదే క్రమంలో ప్రియ…రామ్‌కు బ్రేకప్ చెబుతుంది. దీంతో ఆ బాధ నుండి బయటకు వచ్చేందుకు తన స్నేహితుడైన పండితుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. ఆయన సూచన మేరకు సూరి (అభినవ్ సర్దార్) అనే వ్యక్తిని కలవడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది…? వీరి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నదే కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ,నటీనటులు, సెకండాఫ్. సూరి పాత్రలో అభినవ్ సర్దార్ ఒదిగిపోయాడు. లవర్ బాయ్ గా, ఎగ్రెసివ్ లుక్‌లో తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రామ్‌ కార్తీక్‌ సైతం తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. షెర్రీ అగర్వాల్, చాందిని తమిళరాసన్ తత పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మిగితా పాత్రల్లో శుభలేఖ సుధాకర్, సుమన్‌ జీవించేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ ఫస్టాఫ్,ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే వరకు స్లోగా సాగే కథనం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. తొలి సినిమానే అయినప్పటికి దర్శకుడు తాను అనుకున్న పాయింట్‌ను చక్కగా ప్రజెంట్ చేయగలిగాడు. సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్,సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

తీర్పు:

తాను ఎంచుకున్న కథకు రెండు విభిన్న జీవితాల్ని ముడిపెట్టడం ఈ సినిమాకు మరింత కొత్తదనం వచ్చింది. స్క్రీన్ ప్లే, ట్విస్టులు బాగున్నాయి. ఓవరాల్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని మిగిల్చే మూవీ రామ్ అసుర్‌.

విడుదల తేదీ:19/11/21
రేటింగ్:2.75/5
నటీనటులు : అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
నిర్మాత : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ
దర్శకత్వం : వెంక‌టేష్ త్రిప‌ర్ణ

- Advertisement -