ఇట్స్ క్లియర్..బీజేపీ బాణమే….!

64
sharmila
- Advertisement -

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్‌టీపీ పేరుతో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం అని రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్న ఏపీ సీఎం జగన్‌పై కోపం ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలని కాని తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటనీ రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు జగన్, షర్మిలు తెలుగు రాష్ట్రాలను పంచుకుని దోచుకునేందుకు రెడీ అయ్యారని రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నరు. తెలంగాణలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు అయిన మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, రెడ్ల ఓట్లను చీల్చేందుకు షర్మిల పార్టీ పెట్టిందని , ఆమె వెనుక కేసీఆర్ ఉన్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నరు. అయితే షర్మిల ఒక్క సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుని నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తోంది. దీంతో కాంగ్రెస్ వాదన తప్పు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నరు.

సౌత్ ఇండియాలో పాగా వేయాలన్న కేంద్రంలోని బీజేపీ పెద్దల వ్యూహంలో భాగంగా తెలంగాణలో షర్మిలతో పార్టీ పెట్టించిందని, తద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకు అయిన క్రైస్తవులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకుకు షర్మిల గండికొడుతుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. ఇటు సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ సర్కార్‌ను, అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల బీజేపీ నేతల గురించి పల్లెత్తు మాట అనడం లేదు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలపై మోదీని నిలదీసింది లేదు. నిరుద్యోగుల పేరుతో దీక్షలు చేస్తున్న షర్మిల కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రతి ఏటా రెండు కోట్లఉద్యోగాలు ఇస్తానని మాట తప్పిన బీజేపీని ప్రశ్నించింది లేదు. దళితులు, మైనారిటీలపై కాషాయనేతలు దాడులు చేస్తున్నా కిక్కురుమనడం లేదు. తెలంగాణ బీజేపీ నేతలపై ఒక్కసారిగా కూడా నోరెత్తింది లేదు. దీన్ని బట్టి షర్మిల కమలం వదిలిన బాణమే అన్న వాదనకు బలం చేకూరుతోంది. తాజాగా తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై పొలిటికల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

యాసంగి బియ్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని ముంచుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం వరి కొనమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని అడ్డగోలుగా బుకాయిస్తున్నారు. వానాకాలం బియ్యమైనా, యాసంగి బియ్యమైనా కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే..కేసీఆర్ సవాల్‌కు తెలంగాణ బీజేపీ నేతలు స్పందించాల్సిందే..వరి కొనుగోలుపై బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లి లేఖ తీసుకురావాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం అసలు వాస్తవాలు వెల్లడించారు. అయితే వైఎస్ షర్మిల మాత్రం ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు వేదన పేరుతో మరో పెయిడ్ దీక్షకు దిగింది. .షర్మిల రాజకీయంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. . ధాన్యం కొనుగోలు చేయని కేంద్రాన్ని లదీయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలేంటని విమర్మలు వెల్లువెత్తున్నాయి. షర్మిల రాజకీయం బీజేపీకి అనుకూలంగా ఉందని, ఆమె కమలం వదిలిన బాణమే అని రైతు వేదన దీక్షతో తేలిపోయింది. కమలం విడిచిన బాణమా…నీ రాజకీయం ఈ పోరాటాల గడ్డపై నడవదని తెలంగాణవాదులు షర్మిలను హెచ్చరిస్తున్నరు.

- Advertisement -