త్వరలో కోవాగ్జిన్‌కు బ్రిటన్ గ్రీన్‌సిగ్నల్!

152
covid 19
- Advertisement -

త్వరలో భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ టీకాకు అనుమతించనుంది బ్రిటన్‌. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎమ‌ర్జెన్సీ వాడ‌కం జాబితాలో ఉన్న టీకాల‌కు త్వ‌ర‌లోనే గుర్తింపు ఇవ్వ‌నున్న‌ట్లు బ్రిట‌న్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.కోవాగ్జిన్ టీకాలు తీసుకున్న భార‌తీయుల‌ను త‌మ దేశంలోకి అనుమ‌తించ‌నున్న‌ట్లు బ్రిట‌న్ చెప్పింది.

18 ఏళ్లు దాటి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న‌వారిని అనుమ‌తించ‌నున్న‌ట్లు ర‌వాణా శాఖ తెలిపింది. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి క్వారెంటైన్ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వు. న‌వంబ‌ర్ 22 నుంచి ఈ కొత్త నిబంధ‌న అమ‌లులోకి రానున్న‌ది. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న వ్య‌క్తుల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌, మ‌లేషియా, ఇండియా దేశ‌స్థుల్లో ఈ జాబితాలో తొలి వ‌ర‌స‌లో ఉంటార‌న్నారు. డబ్ల్యూహెచ్‌వో జాబితాలో ఉన్న సైనోఫార్మ్‌, కోవాగ్జిన్ టీకాల‌కు ఓకే చెప్పేందుకు ఇంగ్లండ్ ప్రిపేర‌వుతోంది.

- Advertisement -