బిగ్ బాస్ 5..ఈ వారం నామినేషన్స్‌లో ఎంతమందో తెలుసా!

131
bb5
- Advertisement -

బిగ్ బాస్ 5 తెలుగు విజయవంతంగా 10వ వారంలోకి ఎంటర్‌అయింది. 10వ వారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగగా ఈ వారం నామినేషన్‌లో ఐదుగురు నిలిచారు. హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న ఆనీ.. ఇంటిలో ఉన్న నలుగుర్ని డైరెక్ట్‌గా నామినేట్ చేసి జైలులో బంధించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఆనీ మాస్టర్… కాజల్‌,సన్నీ,మానస్, షణ్ముఖ్‌లను నామినేట్ చేసింది .

ఆనీ మాస్టర్ చేసిన నామినేషన్‌ని మార్చే అవకాశాన్ని మిగిలిన ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్. దీనిలో భాగంగా బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న సంకెళ్లను పట్టుకుని వాటి ద్వారా తమకి ఇష్టమైన వాళ్లని విడిపించవచ్చని చెప్పారు. అలా విడుదలైన సభ్యుడు హౌస్‌లో ఉన్న ఇద్దర్ని నామినేట్ చేయొచ్చని చెప్పారు. ఆ ఇద్దరిలో ఒకరు నామినేట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. తొలుత పింకీ..సంకెళ్లను దక్కించుకుని మానస్‌ని జైలు నుంచి విముక్తి కల్పించింది. అయితే మానస్.. రవి, జెస్సీలను నామినేట్ చేయగా.. చివరికి ప్రియాంక, మానస్‌లు చర్చించి జెస్సీని జైలుకి పంపి నామినేట్ చేశారు.

తర్వాత సిరి…జెస్సీని సేవ్ చేసింది. ఈ సందర్భంలో షణ్ముఖ్‌కి సారీ చెప్పింది సిరి. బయటకు వచ్చిన జెస్సీ.. తిరిగి మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఫైనల్‌గా ఆ ఇద్దరిలో సిరి అందరూ ఊహించినట్టే మానస్‌ని నామినేట్ చేసింది. తర్వాత జెస్సీ సంకెళ్లను చేజిక్కించుకుని షణ్ముఖ్ జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. షణ్ముఖ్‌…పింకీ, సిరిలను నామినేట్ చేశాడు. చివరికి జెస్సీ.. సిరిని సేవ్ చేసి పింకీని జైలుకి పంపాడు.

తర్వాత రవి సంకెళ్లు దక్కించుకుని పక్కా ప్లానింగ్‌తో ప్రియాంకను జైలు నుంచి రిలీజ్ చేశాడు. ఆమె షణ్ముఖ్, జెస్సీలను నామినేట్ చేయడంతో ఫైనల్‌గా రవి జెస్సీని సేవ్ చేసి షణ్ముఖ్‌ని మళ్లీ జైలు లోపలికి పంపాడు. ఇక శ్రీరామ్ సంకెళ్లను దక్కించుకుని కాజల్‌ని జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. దీంతో బయటకు వచ్చిన కాజల్.. సిరి, రవిలను నామినేట్ చేసింది. ఫైనల్‌గా శ్రీరామ్… రవిని సేవ్ చేసి.. సిరిని నామినేట్ చేసి జైలుకి పంపాడు.

కాజల్ తన బెస్ట్ ఫ్రెండ్స్ మానస్, సన్నీలను కాకుండా షణ్ముఖ్‌ని జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చింది. అయితే షణ్ముఖ్.. రవి, శ్రీరామ్‌లను నామినేట్ చేశాడు. ఈ ఇద్దర్లో కాజల్ చివరికి రవిని నామినేట్ చేసి జైలుకు పంపింది. దీంతో చివరగా మానస్, సిరి, సన్నీ, రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు.

- Advertisement -