ప్రతి జిల్లాకు పార్టీ కార్యాలయంలో భాగంగా జనగామ టిఆర్ఎస్ పార్టీ జల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు, అలాగే ఉమ్మడి జిల్లాలో మిగతా జిల్లాల పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయా కార్యాలయాలను సిఎం కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిపిస్తామని మంత్రి తెలిపారు.
జనగామ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి.. సంబంధిత కాంట్రాక్టర్ కి తగు సూచనలు చేశారు. పార్టీ కార్యాలయాలు ప్రారంభమైతే పార్టీ కార్యకలాపాలన్నీ అందులోనే జరుపుకునే వీలు కలుగుతుందన్నారు. పార్టీ శ్రేణులకు కూడా అనుకూలంగా ఉంటుందన్నారు. పార్టీ కార్యాలయాలు సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో నిర్మిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.