దుమ్ములేపుతున్న ‘భీమ్లా నాయ‌క్’ టైటిల్ సాంగ్..

127
- Advertisement -

పవన్ కల్యాణ్, రానా నటిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ భీమ్లా నాయ‌క్. సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కి రీమేక్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈరోజు ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్‌ విడుదలైంది. ఈ పాటను మేకర్స్ నవంబర్ 7న ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేశారు. లాలా భీమ్లా అంటూ కొన‌సాగుతోన్న ఈ పాట అభిమానుల‌ను అల‌రిస్తోంది.

ఈ పాట‌కు సాహిత్యం త్రివిక్ర‌మ్ అందించారు. థ‌మన్ అద్భుత‌మైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని కొన్ని సీన్ల‌కు సంబంధించిన ఫొటోల‌ను కూడా ఈ వీడియోలో చూపించారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా స‌ర‌స‌న సంయుక్త మీనన్ న‌టిస్తోంది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -