- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డెల్టా వైరస్ కలకలం రేపుతోంది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ఏవై.4.2 కేసులు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. హైదరాబాద్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏడుగురిలోనూ ఈ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. మొత్తంగా ఏపీలో ఏడు కేసులు ఉండగా కేరళలో నాలుగు, తెలంగాణలో రెండు, కర్ణాటకలో రెండు, మహారాష్ట్ర.. కశ్మీర్ లో ఒకొక్కటి చొప్పున నమోదయ్యాయి.
ఈ వేరియంట్ కారణంగా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పాటు చావు రేటు కూడా వేగంగానే ఉంటుంది. మానవ శరీరంలో దీని పునరుత్పత్తి ఫాస్ట్ గా జరుగుతుంది.కొవిడ్ లక్షణాలు ఉన్న వారెవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని సీనియర్ పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ అంటున్నారు. ట్రావెల్ ఆంక్షలు లేనప్పటికీ స్వతహాగా వేరియంట్ల వ్యాప్తి పెరగకుండా ఉండేంుదకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
- Advertisement -