మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..

166
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ కూడా లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.108.29, లీటర్‌ డీజిల్‌ ధర రూ.97.02కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.63కి చేరగా,డీజిల్‌ రూ.105.84గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర ఏకంగా రూ.114.40గా ఉండగా లీటర్‌ డీజిల్‌ ధర రూ.106.99కు పెరిగింది.

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.114.14, లీటర్‌ డీజిల్‌ ధర రూ.105.12కు చేరింది. చెన్నైలో పెట్రోల్‌ రూ.105.13, డీజిల్‌ రూ.101.25గా ఉండగా.. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.108.78, డీజిల్‌ రూ.100.14కు చేరాయి. చమురు ధరలు ప్రత్యక్షంగా కొన్ని రంగాలపై, పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.

- Advertisement -