చిరంజీవి…’భోళా శంకర్’కి ముహూర్తం ఫిక్స్

109
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతోన్న భోళా శంకర్ సినిమా ముహూర్తం ఫిక్స్ అయింది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతోంది. నవంబర్ 11 ఉదయం 7:45 గంటలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. నవంబర్ 15 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అన్నాచెల్లెళ్ల బంధం చుట్టు తిరిగే ఈ కథలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవి సరసన నటించే హీరోయిన్‌ పేరును అతి త్వరలో ప్రకటించనున్నారు మేక‌ర్స్‌.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌కు ఆయన అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భోళా శంకర్ సినిమా ని అనిల్ సుంకర గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ భాగస్వామ్యం తో ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. భోళా శంకర్ 2022లో విడుదల కానుంది.

నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్
సాంకేతిక బృందం
డైరెక్టర్ : మెహర్ రమేష్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
బ్యానర్ : ఏకే ఎంటర్టైన్మెంట్స్,
మ్యూజిక్ : మహతి స్వర సాగర్

- Advertisement -