బిగ్ బాస్ 5..మరింత ఘాటుగా షన్ను-సిరి రొమాన్స్‌!

106
siri
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 53 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా షణ్ముఖ్ – సిరి ఫ్రెండ్ షిప్ ముసుగులో రొమాన్స్‌కు తెరలేపారు. కెప్టెన్ పోటీదారులుగా గెలిచిన వారికి మాత్రమే హౌస్‌లోకి ఎంట్రీ ఉండటంతో సిరి, షణ్ముఖ్‌, శ్రీరామ్ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్లందరికీ ఫుడ్ అండ్ బెడ్ అంతా బయటే. దీంతో దుప్పట్లు, చాపలు వేసుకుని బయటే పడుకున్నారంతా.

షణ్ముఖ్‌ని ఇప్పటికే సంగం ముంచి ఏమీ చేతకాని వాడిలా చేసిన సిరి అతన్ని పూర్తిగా ముంచేట్టుగానే కనిపిస్తుంది. షణ్ముఖ్‌ని కొడుతూ.. తిడుతూ.. తన్నుతూ ఓవరాక్షన్ చేసింది. సారీ చెప్పు.. అని షణ్ముఖ్ మీది మీదికి వెళ్తే అతను పనిలో పనిగా సిరిని హగ్ చేసుకున్నాడు. తర్వాత మళ్లీ షణ్ముఖ్‌కి దగ్గరకు వెళ్లి సారీ చెప్పు సారీ చెప్పు అని అడిగి మరీ హగ్ చేయించుకుని రొమాన్స్‌లో మునిగిపోయింది సిరి. ఒకే బెడ్ పై పడుకోవడం.. ఒకే దుప్పట్లో దూరడం ప్రేక్షకులకు చికాకు తెప్పించింది.

హెల్త్ ఇష్యూస్‌తో ఈవారం కెప్టెన్ పోటీదారుల టాస్క్‌ నుంచి గివ్ అప్ ఇస్తానని చెప్పిన జెస్సీ మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు. కెప్టెన్ అయినవాళ్లు కూడా గివ్ అప్ ఇవ్వడం లేదు.. అలాంటప్పుడు నేను ఎందుకు గివ్ అప్ ఇవ్వాలని వాదించడం మొదలుపెట్టాడు. జెస్సీ డ్రాప్‌ అయ్యాడని వరస్ట్ పర్ఫామర్ ఇవ్వొద్దని కోరింది సిరి.చర్చల అనంతరం నాలుగో రౌండ్ టాస్క్‌కి పింకీ, ఆనీ మాస్టర్‌లు పోటీపడ్డారు. బోర్డ్‌పై రంగులు నింపే ఈ ఛాలెంజ్‌లో పోటా పోటీగా రంగులు నింపుతుండగా.. ఆనీ మాస్టర్, పింకీ ఇద్దరూ కాలు జారి కిందపడ్డారు. అయితే పింకీ నడుముకి గట్టిగానే దెబ్బతగలడంతో కాసేపు విలవిల్లాడింది. చివరికి ఈ టాస్క్‌లో ఆనీ వేసిన రెడ్ కలర్ ఎక్కువగా కనిపించడంతో నాలుగో రౌండ్‌లో ఆమెను విజేతగా ప్రకటించాడు సన్నీ. ఇక ఐదో రౌండ్‌లో సన్నీ, కాజల్‌లు పోటీపడగా సన్నీ విజేతగా నిలిచాడు. మొత్తంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, ఆనీ, సన్నీ ఈ ఐదురుగు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.

మిగిలిన ఇంటి సభ్యులకు కెప్టెన్ పోటీదారులు కావడానికి మరో అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దీనిలో భాగంగా ఒక బాల్‌ని సర్కిల్‌లో పెట్టి ఆ బాల్‌ని ఫస్ట్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్లు ఒక్కొక్కర్నీ గేమ్‌ని నుంచి తప్పించవచ్చని చెప్పారు. దీంతో మానస్ అన్ని సార్లు బాల్‌ని అందిపుచ్చుకుని.. విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్, ప్రియాంక ఇలా ఒక్కొక్కర్నీ గేమ్ నుంచి తప్పించుకుంటూ వచ్చి.. ఈ టాస్క్‌లో విజేతగా నిలిచి ఆరో కెప్టెన్ పోటీదారుడు అయ్యాడు.

- Advertisement -