హుజురాబాద్ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకోసం ఎన్నారై తెరాస ఎన్నో వారాల నుండి విస్తృత ప్రచారం నిర్వహిస్తుందని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా మా ఓటు కెసిఆర్ సార్ కే అని అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారని, సర్వేలన్నీ తెరాస అభ్యర్ధే గెలుస్తాడని చెప్తున్నాయని అనిల్ కూర్మాచలం తెలిపారు.
హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలని పర్యటించి ప్రచారం నిర్వహించామని , ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా కెసిఆర్ సార్ వెంటే ఉన్నామని , వెన్నుపోటు ఈటలకు తగిన బుద్ది చెప్తామని ప్రజలు చెప్తున్నట్టు అనిల్ తెలిపారు.
బాధ్యత గల తెరాస కార్యకర్తలుగా ఎన్నిక ఏదైనా తెరాస అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని , అలాగే ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ఎన్నారై తెరాస అటు సోషల్ మీడియా ద్వారా ఇటు క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుందని అనిల్ తెలిపారు.
కెసిఆర్ గారికి హుజురాబాద్ అంటే ప్రత్యేక అభిమానమున్న సంగతి ఇక్కడి ప్రజలకు తెలుసునని అందుకే వారు మా ఓటు కెసిఆర్ సార్ కు కారు గుర్తుకేనని చెప్తున్నారని , ముఖ్యంగా దళిత వాడల్లో పండగ వాతావరణమున్నదని ‘దళిత బంధు’ తో మా జీవితాలే మారిపోయాయని కెసిఆర్ సార్ మాకు తండ్రి లాంటి వాడని, గెల్లు శ్రీనివాస్ ని భారీ మెజారిటీ తో గెలిపించుకొని కెసిఆర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటామని దళిత బిడ్డలు చెప్తున్నట్టు అనిల్ తెలిపారు.
హుజురాబాద్ లో అభివృద్ధి జరగాలంటే తెరాస అభ్యర్థినే భారీ మెజారిటీ తో గెలిపించాలని బిజెపి కి ఓటు వేస్తే హుజురాబాద్ కి వచ్చే లాభమేం లేదని రోజు రోజుకి ధరలు పెరగడం తప్పా , నేడు గెలిచిన బిజెపి ప్రజా ప్రతినిధులు వారి నియోజిక వర్గాల అభివృద్ధికి ఎం చేశారో చెప్పి ఓట్లు అడగాలని , ప్రజలు కూడా విజ్ఞతతో అలోచించి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న తెరాస పార్టీ కారు గుర్తుకు ఓటెయ్యాలని అనిల్ కూర్మాచలం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నిక తేదీ సమీపిస్తున్న కొద్దీ బిజెపి పార్టీ నానా డ్రామాలు చేస్తారని ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తారని కావున ప్రజలంతా వాటిని నమ్మకుండా ఓటు తో వారికి తగిన బుద్ది చెప్పాలని అనిల్ కూర్మాచలం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచారం లో ఎన్నారై తెరాస నాయకులతో పాటు సోషల్ మీడియా నాయకులు కూడా వీరితో కలిసి పాల్గొని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రజల్ని కోరారు.
ఎన్నారై తెరాస నాయకుల ప్రచారానికి సహకరించిన ప్రోత్సహించిన ఎన్నికల ఇంచార్జ్ మంత్రి హరీష్ రావు గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారికి , మంత్రి గంగుల కమలాకర్ గారికి , ఎమ్మెల్యే బాల్క సుమన్ గారికి , ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి స్థానిక నాయకులకు, ఇతర ప్రజా ప్రతినిథులకు , ఎన్నారై తెరాస సీనియర్ నాయకులు రాజ్ కుమార్ శానబోయిన కు , మీడియా మిత్రులకు , తెరాస కార్యకర్తలకు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు.