దళితబంధుతో ఆర్థిక ప్రగతి: జగదీశ్ రెడ్డి

40
jagadishreddy

దళితబంధు పథకం అమలుతో వాసాలమర్రి గ్రామ దళితులు ఆర్ధికంగా ఎదుగుతారని పేర్కొన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రిలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత క‌లిసి ద‌ళితబంధు ప‌థ‌కం ల‌బ్దిదారుల‌కు యూనిట్ల‌ను పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ.. వాసాల‌మ‌ర్రి ద‌ళితులు సీఎం కేసీఆర్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాలి. ఈ గ్రామ ద‌ళితులు ఆర్థికంగా విజ‌యం సాధించి దేశానికే ఆద‌ర్శంగా నిల‌వాల‌న్నారు. దళితబందు పథకం ప్రపంచానికే గొప్ప దారి చూపే పథకం అని కొనియాడారు.

అనంత‌రం ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ.. వాసాల‌మ‌ర్రి గ్రామం చ‌రిత్ర‌లో నిలిచిపోయింద‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన భరోసాతో వాసాలమర్రి గ్రామ దళితుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది అని పేర్కొన్నారు. రూపాయి కూడా వృధా చేయకుండా ఆర్ధికంగా బలోపేతం కావాలి. దేశానికే ఆదర్శంగా నిలిచేలా వాసాలమర్రి దళితులు సమగ్రాభివృద్ధి సాధించాలన్నారు.