తెలంగాణ రాష్ట్రంలో ఈరోజుతో 3 కోట్ల కరోనా వ్యాక్సిన్‌లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ వైద్యారోగ్య శాఖను అభినందించారు. సీఎస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 కోట్ల వాక్సిన్ డోసులు పూర్తికావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి కోటి డోసులు కంప్లీట్ కావడం కోసం 165 రోజులు పట్టింది. ఆ తరవాత కోటి డోసులు కంప్లీట్ కావడం కోసం 81 రోజులు పట్టింది. 36 రోజుల్లోనే మరో కోటి డోసులు పూర్తి చేయడం జరిగిందన్నారు.
అత్యధిక జనాభా కల్గిన మన దేశంలో కూడా 100 కోట్ల వాక్సిన్ డోసులు పూర్తి కావడం సాధారణమైన విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలోని 3700 లొకేషన్స్ లో సిబ్బంది నిత్యం పని చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు మేరకు వాక్సిన్ కార్యక్రమం చాలా వేగంగా జరిగింది. సూపర్ స్ప్రెడర్స్ వాక్సిన్ ఇవ్వాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం తీసుకున్న చర్యలు దేశం మొత్తం ఫాలో అయింది. ఇంకా ఎవరైనా వాక్సిన్ తీసుకోవాల్సిన వారు ఎవరైనా ఉంటే వారందరూ వాక్సిన్ తీసుకోవాలి అని సీఎస్ సూచించారు.