ఈ ఘనత ప్రతీ పౌరుడిది: మోడీ

124
modi
- Advertisement -

అక్టోబర్ 21 నాటికి దేశంలో వంద కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ సందర్భంగా జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ఈ ఘనత ప్రతీ పౌరుడికి దక్కుతుందన్నారు. దేశ చ‌రిత్ర‌లో ఇదో కొత్త అధ్యాయం అన్నారు. బిలియ‌న్‌ వ్యాక్సిన్ డోసుల పంపిణీలో వీఐపీ క‌ల్చ‌ర్ చోటుచేసుకోలేద‌న్నారు.

వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై మొద‌ట్లో చాలా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యాయ‌ని, ఇండియా లాంటి దేశంలో వ్యాక్సిన్ క్ర‌మ‌శిక్ష‌ణ ఎలా సాధ్యం అవుతుంద‌ని విమ‌ర్శించార‌న్నారు. స‌బ్‌కా సాత్‌.. స‌బ్ కా వికాస్‌కు ఇండియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ స‌జీవ ఉదాహ‌ర‌ణ అన్నారు. దేశంలో జ‌రిగిన వ్యాక్సినేష‌న్ విధానంపై గ‌ర్వంగా ఫీల‌వ్వాల‌ని, శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో.. శాస్త్రీయ ఆధారంగా వ్యాక్సినేష‌న్ జ‌రిగ‌నిట్లు ప్ర‌ధాని తెలిపారు. సంపూర్ణంగా సైంటిఫిక్ ప‌ద్ధ‌తుల్లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగిన‌ట్లు చెప్పారు.

క‌ఠిన ప‌రిస్థితుల్లో ఇండియా ఓ ల‌క్ష్యాన్ని విజ‌య‌వంతంగా చేరుకున్న‌ట్లు చెప్పారు. ల‌క్ష్యాల కోసం దేశం క‌ఠినంగా ప‌నిచేస్తుంద‌న్న సంకేతాన్ని చెబుతుంద‌న్నారు. ఇది భార‌త సామ‌ర్ధ్యానికి ప్ర‌తిబింబంగా నిలుస్తుంద‌న్నారు.

- Advertisement -