బిగ్ బాస్ 5..ఎపిసోడ్ 46 హైలైట్స్

98
bb5
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 46 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ప్రియా మరోసారి తన కన్నింగ్ క్యారెక్టర్ బయటపెట్టింది. తన చెండాలమైన ప్రవర్తనతో చిరాకు రప్పించింది. పిచ్చెక్కినట్టుగా నవ్వుతూ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? అనేట్టుగా ప్రవర్తించింది.

ఇక రెండో రోజు కూడా ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ కంటిన్యూ అయింది. టాస్క్‌లో భాగంగా ఎల్లో స్పెషల్ గుడ్డుని పట్టేశాడు విశ్వ. ఆ పవర్‌‌తో ఐదు గుడ్లును పొందుకునే అవకాశాన్ని కాజల్‌ని పోటీదారుగా ఎంచుకున్నాడు విశ్వ. ఈ ఐదు గుడ్లును పొందుకోవాలంటే.. ఒంటిపై ఒకదానిపై ఒకటి బట్టలు వేసుకోవాలని ఎవరు ఎక్కువ బట్టలు (ఒకదానిపై ఒకటి) ధరిస్తారో వాళ్లకి బోనస్ గుడ్లు లభిస్తాయని బిగ్ బాస్ తెలపగా ఈ టాస్క్‌లో విశ్వ ఒకదానిపై ఒకటి 106 బట్టలు వేసుకోగా.. కాజల్ 79 మాత్రమే వేసుకోగలిగింది. ఈ టాస్క్‌లో విజేతగా నిలవడంతో విశ్వకి బోనస్‌గా ఐదు గుడ్లు లభించాయి.

తర్వాత జస్వంత్‌కి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా హౌస్‌లో ఎవరైనా ముగ్గురు సభ్యులు సభ్యుల దగ్గర గుడ్లు లేకుండా నాశనం చేయాల్సి ఉంటుందని.. దొంగిలించిన పర్వాలేదని.. అలా చేయలేకపోతే కెప్టెన్సీ పోటీదారులుగా అర్హత కోల్పోతారని చెప్పారు. ఈ టాస్క్‌లో సహాయకులుగా ఒకర్ని ఎంచుకోవచ్చని బిగ్ బాస్ చెప్పడంతో.. సిరి దగ్గరకు వెళ్లి నీ హెల్ప్ కావాలని అడిగాడు. అయితే షణ్ముఖ్ దగ్గర నేను తీసుకుంటా అని చెప్పి.. వెళ్లిన సిరి అతని దగ్గర ఉన్న ఎగ్స్‌ని ఇచ్చేయడానికి ఒప్పించింది. ఈ ముగ్గురు దగ్గర గుడ్లు లేకుండా చూడటం కోసం జెస్సీ తిప్పలు పడ్డాడు.

అందరూ పడుకున్న తరువాత సన్నీ గుడ్లు నొక్కేయడం మొదలుపెట్టాడు. తను నొక్కేసిన గుడ్లులో కొన్ని మానస్‌కి పంచాడు. సన్నీ తన బుట్ట పక్కనపెట్టి గుడ్లు కోసం పోరాడుతుంటే.. అతన్ని టార్గెట్ చేసిన ప్రియ అతని బుట్టలో ఉన్న గుడ్లను నొక్కేయడానికి ట్రై చేసింది. అయితే సన్నీ ఆమె దగ్గరకు వచ్చి పక్కకి తోసేశాడు. దీంతో ప్రియ రచ్చ రచ్చ చేసింది. సన్నీపై చేయి చేసుకుని అతన్ని గిచ్చింది ప్రియ. అంతటితో ఆగకుండా.. ఫిజికల్ అయితే చెంప పగిలిపోద్దని నోరు పారేసుకుంది. మాట మాట పెరిగి గొడవ పెద్దదిగా మారింది. తర్వాత చల్లబడ్డా…మర్నాడు ఉదయం ఎపిసోడ్ కంటిన్యూ అయింది. పిచ్చి పిచ్చిగా చేస్తూ మళ్లీ సన్నీ బుట్టను తీసి బయటపడేయగా ఆ గుడ్లను తీసుకునేందుకు వచ్చిన సిరి మరింత చెండాలంగా ప్రవర్తించింది.

- Advertisement -