మళ్లీ పెట్రోవాత..

83
petrol

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా దేశవ్యాప్తంగా ఇవాళ మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ పై రూ.35 పైసల చొప్పున పెంచాయి చమురు కంపెనీలు. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.92, డీజిల్‌ ధర రూ.103.91కు చేరింది.

విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113, డీజిల్‌ ధర రూ.105.55 గా ఉండగా ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.19కి పెరుగగా.. ముంబైలో రూ.112.11కి చేరింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌ పట్టణంలో దేశంలోనే అత్యధికంగా లీటరు పెట్రోల్‌ ధర రూ.118.23గా ఉంది. సెప్టెంబర్‌ 5 తర్వాత డిజీల్‌ ధర రూ.6.85, పెట్రోల్‌ ధర రూ.5.35 కు పెరిగింది.